13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కన్నుల పండువగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

26-03-2026 05:48 PM

ఘనంగా సాగిన ధ్వజస్తంభ ప్రథమ వార్షికోత్సవం

కనులారా తిలకించిన భక్తజనం 

పాపన్నపేట: మండల కేంద్రం పాపన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం మహా సుదర్శన యాగం, అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు గణపతి పూజతో ప్రారంభమై పుణ్యావాచనం, నవగ్రహ వాస్తు ఆరాధన, పూర్వక మహా సుదర్శన యాగం అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ తంతును కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.