30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఇవాళ, రేపు తెలంగాణలో వర్షం

09-04-2025 04:35 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): క్యూములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రంలో ఇవా, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.