10 April, 2026 | 3:02 AM

రాయల్ ఫైట్‌లో గెలిచేదెవరు?

10-04-2026 01:09 AM
  1. బెంగళూరుతో రాజస్థాన్ ఢీ
  2. వైభవ్‌పైనే అందరి చూపు
  3. ఓటమెరుగని ఇరు జట్లు

గువాహటి, ఏప్రిల్ 9 : ఐపీఎల్ 19వ సీజన్‌లో మరో రసవత్తర సమరానికి వేళయింది. టోర్నీలో వరుస విజయాలతో దూ సుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. గువాహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సమఉజ్జీల సమరంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇరు జ ట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ మంచి ఫామ్ లో ఫన్నాయి. రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లకు మూడింటిలోనూ గెలిచి ప్రస్తు తం పాయింట్ట పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఆ జట్టు వరుసగా చెన్నై సూప ర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై జట్లపై విజయాలను అందుకుంది. గత మ్యాచ్‌లో ముంబైకి చుక్కలు చూపించింది. రాజస్థాన్ బ్యాటింగ్ లైవప్‌లో ఓపెనర్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ కాంబినేషన్ దుమ్మురేపుతోంది. గత మ్యాచ్‌లో వైభవ్ మెరుపులతో పాటు జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. బుమ్రాతో సహా ముంబై బౌలర్లను ఉతికారేశాడు.

వైభ వ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆర్సీబీ బౌలర్లు కూడా వైభవ్ ను త్వరగానే ఔట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే జురెల్, పరాగ్, హెట్ మె యిర్ లాంటి హిట్టర్స్ కూడా రాజస్థాన్‌కు ప్లస్ పాయింట్. అటు బౌలింగ్‌లోనూ రా యల్స్ ఫామ్‌లో ఉంది. ఆర్చర్, బర్గర్, తు షార్ దేశ్ పాండే, సందీప్ శర్మ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తున్నారు. గుజరాత్ తో మ్యాచ్‌లో వీరంతా సమిష్టిగా రాణించడంతోనే గెలిచిం ది. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు.

గత మ్యాచ్ లో బిష్ణోయ్ 4 కీలక వికెట్లతో తన మ్యాజిక్ చూపించాడు.దీంతో మరోసారి బిష్ణోయ్ కీలకం కాబోతున్నాడు. తుది జట్టులో మా ర్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రా యల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతోంది. ఆర్సీబీ బ్యాటర్లు అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ పై 200కు పైగా టార్గెట్ ఛేదించిన ఆర్సీబీ తర్వాత చెన్నై సూ పర్ కింగ్స్ పై విశ్వరూపం చూపించింది. ఏకంగా 250 పరుగులు చేసి తమ స్టామినా నిరూపించుకుంది.

కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పటిదార్ చెలరేగపోతున్నారు. అలాగే చెన్నై తో మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ విధ్వంసం ఓ రేం జ్‌లో సాగింది. భారీ షాట్లతో రెచ్చిపోయిన టిమ్ డేవిడ్‌పైనే ఆర్సీబీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో కూడా రాజస్థాన్‌కు ధీటుగా బెం గళూరు కనిపిస్తోంది. పేస్ ఎటాక్‌లో వెటరన్ భువనేశ్వర్ కుమార్ తో పాటు డఫీ, రొమారియో షెఫర్డ్ రాణిస్తున్నారు. అటు స్పిన్ వి భాగంలో కృనాల్ పాండ్యా కీలక సమయం లో వికెట్లు తీస్తూ అదరగొడుతున్నాడు. స్పి న్నర్‌గా బౌన్సర్లు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. 

గత రికార్డులు 

ఓవరాల్ రికార్డ్స్‌లో రాజస్థాన్‌పై ఆర్సీబీదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 34 సార్లు తలపడితే  ఆర్సీబీ 17 మ్యాచ్‌లలో గెలిచింది. రాజస్థాన్ 14 మ్యాచ్‌లలో గెలిచింది. 

పిచ్ రిపోర్ట్

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న గువాహటి పిచ్ హైస్కోరింగ్ గ్రౌండ్‌గా అంచనా వేస్తున్నారు. దీంతో పరుగుల వరద ఖాయం.

తుది జట్లు అంచనా

రాజస్థాన్ రాయల్స్ : జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్(కీపర్), పరాగ్(కెప్టెన్), హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, ఆర్టర్, సందీ ప్ శర్మ, బర్గర్, రవిబిష్ణోయ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పటిదార్ (కెప్టెన్), టి మ్ డేవిడ్, జితేశ్ శర్మ(కీపర్), షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, అభినందన్ సింగ్