8 July, 2026 | 7:51 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా రాజేష్

08-07-2026 07:04 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ బూర్గంపాడు మండల అధ్యక్షుడుగా బూర్గంపాడుకు చెందిన కేసుపాక రాజేష్ ను నియమిస్తూ బుధవారం జిల్లా ఎ స్సీ సెల్  చైర్మన్ గద్దల రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడుగా ఎన్నికైన కేసుపాక రాజేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి  మండల అధ్యక్షుడుగా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తన నియమానికి సహకరించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు, డిసిసి అధ్యక్షురాలు దేవి ప్ర సన్నకు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కావంపల్లి సత్యనారాయణకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ కు, కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ సెల్ పురోభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.