29 July, 2026 | 1:19 PM

నాణ్యత లోపాలతోనే కాళేశ్వరం.. KTR మాట్లాడటం సిగ్గుచేటు

29-07-2026 12:30 PM

టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం(TPCC Coordination Committee Meeting) జరిగింది. అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ప్రాజెక్టు కూలింది.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు.

నాణ్యత లోపాలతోనే కాళేశ్వరం కట్టారని మంత్రి ఉత్తమ్(Minister Uttam Kumar Reddy) వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా కట్టి ఉంటే సమస్య వచ్చేది కాదని మంత్రి విమర్శించారు. రైతులకు నీళ్లు ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటామని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు మేరకే చర్యలు తీసుకుంటున్నామని సూచించారు. శ్యాంప్రసాద్ రెడ్డి కంటే ఎక్కువ తెలివి ఉన్న వాల్లు ఎన్డీఎస్ఏలో ఉన్నారని వివరించారు. ఎన్డీఎస్ఏతో సమావేశం అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.