టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో ర్యాలీ
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో 99-Day Action Plan ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు . స్థానిక బస్ డిపో నుండి శివాజీ చౌక్ వరకు ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. మోటారు వాహనదారులకు డిపోమేనేజర్ కే పండరి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన వాహనదారుకు అప్రమత్తంగా వాహనాలు నడపాలని మోటార్ సైకిల్ వాహన దారులు క్రమంగా హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ వాహనదారులు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలు నడిపేముందు ఒక్కసారి మన కుటుంబ సభ్యులను గుర్తుచేసుకోవాలని, వేగం కన్నా ప్రాణం మిన్న రణం తిరిగిరానిది. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని ఆయన కోరారు. కార్యక్రమములో అసిస్టెంట్ ఇంజనీర్ ( ఎం ) నవీన్ కుమార్ ఎస్.టి. ఐ.శకుంతల సుపర్ వైసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.




