10 July, 2026 | 10:04 AM

రతన్ టాటా అంతిమయాత్ర

10-10-2024 04:19 PM

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం అయింది. ఎన్ సీపీఏ గ్రౌండ్ నుంచి రతన్ టాటా భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. ముంబయి తీరప్రాంత రహదారి గుండా శ్మశానవాటికకు తీసుకెళ్లనున్నారు. ముంబయి వర్లి స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు చేయనున్నారు. టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో 86 ఏళ్ల వయసులో మరణించారు. టాటా పార్థివ దేహాన్ని, జాతీయ జెండాతో కప్పి, తెల్లటి పూలతో అలంకరించి, కొలాబాలోని ఆయన ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NCPA)కి ఉదయం 10 గంటల నుంచి ప్రజల దర్శనం కోసం తీసుకొచ్చారు.