10 July, 2026 | 1:34 AM

డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం

10-07-2026 12:31 AM
  1. ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలి
  2. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  3. హనుమకొండలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’కు శ్రీకారం 
  4. డ్రగ్స్ వ్యతిరేక పోస్టర్ల ఆవిష్కరణ
  5. విద్యార్థులతో ప్రతిజ్ఞ, ర్యాలీ

హనుమకొండ (మహబూబాబాద్), జూలై 9 (విజయక్రాంతి): మత్తు పదార్థాల నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చి, డ్రగ్స్ రహిత భారత్, డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్, డ్రగ్స్ రహిత తెలంగాణ’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.

మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వా మ్యు లు కావాలని చేపట్టిన సంతకాల సేకరణలో గవర్నర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు సం తకాలు చేశారు. అనంతరం విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలతో కలిసి ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ నిర్మూలనకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కలెక్టరేట్ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ సామాజిక చైతన్య ఉద్యమంగా మారాలన్నారు. మత్తు రహిత సమా జ నిర్మాణం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం, ప్రతి సమాజం, ప్రతి వ్యక్తి బాధ్యత అని స్పష్టం చేశారు.

‘మా ఇంట్లో మత్తు పదార్థాలకు చోటు లేదు’ అనే సంకల్పాన్ని ప్రతి కుటుంబం చేసుకుంటే సమాజం మొత్తం మత్తు రహితంగా మారుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం లో చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అభినందిస్తున్నట్టు చెప్పారు.

హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సం ఘాల ఉత్పత్తుల స్టాళ్లను గవర్నర్ సందర్శించి, మహిళల కృషిని అభినందించారు. మహిళల శ్రమకు ప్రోత్సాహంగా పలు ఉత్పత్తులను స్వ యంగా కొనుగోలు చేశారు.

అలాగే ప్రసిద్ధ వరంగల్ దరీ స్టాల్‌ను సందర్శించి, దరీల ప్రత్యేకత, తయారీ ప్రక్రియ, వాటి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాల గురించి తెలుసుకున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ దేశ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు.

రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె. ఆర్ నాగరాజు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్వేత, కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్, డాక్టర్ సత్య శారద, జిడబ్లుఎంసి కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.

భద్రకాళి ఆలయంలో గవర్నర్ పూజలు

వరంగల్(విజయక్రాంతి): వరంగల్ భద్రకాళి ఆలయాన్ని గురువారం సాయంత్రం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సందర్శించారు. అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనం గా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.