బెంగాల్‌ ఉప ఎన్నికల్లో హైటెన్షన్!

06-10-2026 | 10:47am

పశ్చిమ బెంగాల్‌లోని రేజీనగర్ (Rejinagar) ఉప ఎన్నికల పోలింగ్‌ (Polling) సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, టీఎంసీ కార్యకర్తలకు (TMC Workers) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులు ఆరోపించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: దుకాణాల క్లోజింగ్‌.. హైకోర్టు సీరియస్

మరోవైపు పోలీసులు దొంగ ఓట్లు (Bogus Votes) వేస్తున్నారని టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట (Scuffle) జరిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పలువురు టీఎంసీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రేజీనగర్‌లో పోలింగ్‌ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు (Security Forces) పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఏజేయూపీ అధినేత హుమాయున్ కబీర్‌ను కూడా పోలీసులతో వాగ్వాదం అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు తాజా సమాచారం.

మరిన్ని వార్తలు