12 June, 2026 | 12:39 PM

Breaking News

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్

12-06-2026 11:38 AM

మఠంపల్లి జూన్ 12(విజయక్రాంతి): మఠంపల్లి మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో క్రమంగా ఋతుపవనాలు విస్తరిస్తున్నాయని దీని వలన ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లోని చెరువులు, వాగులు,వంకల వద్దకు ప్రజలెవరు వెళ్లవద్దని,ముఖ్యంగా కృష్ణ నదిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు,పశువుల మేతకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అదే విధంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఇండ్ల నుంచి ఎవరు బయటకి రావద్దని,వర్షం పడే సమయంలో చెట్ల కింద,ఎత్తైన ప్రదేశాలు, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని హెచ్చరించారు.చిన్న పిల్లలు కరెంటు స్తంభాలకు దూరంగా ఉంచాలని, రైతులు పంట పొలాలలో విద్యుత్ మోటారు వద్ద జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.