12 June, 2026 | 10:26 AM

పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత

12-06-2026 09:53 AM

గుండాల, (విజయక్రాంతి): మండల పరిధిలోని యాపలగడ్డ గ్రామ సమీప అరెం వారి ఇలవేల్పు శ్రీ పగిడిద్దరాజు ఆలయ ప్రాంగణంలో బోర్ వేపిస్తానని గత సంవత్సరం జాతర సమయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గురువారం ఎమ్మెల్యే పాయం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే ఖదీర్ ల ఆధ్వర్యంలో బోర్ వెల్ సహాయంతో బోర్ వేపించి, దానికి చేతి పంపు సహాయంతో నీటిని వినియోగించుకునేలా ఏర్పాటు చేయించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అరెం వంశస్థులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాయం గతంలో కూడా సీసీ రోడ్డు వేపిస్తానని హామీ ఇచ్చి వేపించడం జరిగిందని, గత ప్రభుత్వంలో నాయకుల చుట్టూ అనేక మార్లు దరఖాస్తులు పట్టుకుని తిరిగినా ఎవరు కూడా పటించుకోలేదని అన్నారు. ఆలయ నిర్మాణం సమయంలో కూడా ఆర్థిక సహాయం చేశారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, మండల నాయకులు వాంకుడోత్ బీకోజీ, ఎస్కే వాజీద్, ఎస్కే కాసీం, వాంకుడోత్ రమేష్, ఎస్కే ఇస్రార్ నూనావత్ రవి, బొంగు చంద్రశేఖర్, గుర్రం పుష్పరాజ్, గడ్డం రాజేష్, బానోత్ నరేందర్, వార్డ్ మెంబర్ లు ఈసం చంద్రయ్య, సనప రాంబాబు, పూజారి అరెం అప్పయ్య, ఆలయ కమిటీ సభ్యులు అరెం బసవయ్య, అరెం కాంతారావు, నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.