వర్షానికి విరిగిన చెట్ల కొమ్మల తొలగింపు
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం(Mallapur Mandal) మొగిలిపేట గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి రహదారిపై విరిగిపడిన చెట్ల కొమ్మలను గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్ ఆధ్వర్యంలో తొలగించారు. రహదారి మధ్యలో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సర్పంచ్ వెంటనే గుర్తించారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా సర్పంచ్ తన పాలకవర్గంతో కలిసి తక్షణమే స్పందించి రహదారికి అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.
సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుడు సాయిలు, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి శ్రమదానం చేసి రహదారిపై పడి ఉన్న చెట్ల కొమ్మలను పూర్తిగా తొలగించారు. రహదారిని పూర్తిగా శుభ్రం చేసి వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేశారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రమదానం చేసిన సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, వార్డు సభ్యుడు సాయిలు, గ్రామపంచాయతీ సిబ్బందిని వాహనదారులు, గ్రామస్తులు అభినందించారు.