నీటి సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతి...

28-09-2026 | 07:57pm

బాన్సువాడ, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి, బండాగల్లి, సిద్దిగల్లి, పోచమ్మ గల్లి, హనుమాన్ కాలనీలో గత ఆరు రోజులుగా నీటి సమస్య పరిష్కారానికై కాలనీ మహిళలతో కలిసి బిజెపి నాయకులు వినతి పత్రాన్ని ఎంపీడీవో ఆనందుకు అందజేశారు. అమృత్ 2.0 కింద బాన్సువాడకు కేంద్ర ప్రభుత్వం  52 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ ఇక్కడ అధికారులు కాంట్రాక్టర్లు పనులపై నిర్లక్ష్యం చేయడంతో గత రెండు నెలల నుంచి పనులు జరగడం లేదు అందువలన నీటి సమస్య ఏర్పడింది.

నీటి సమస్యను రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని బస్తి వాసులతో ముట్టడి నిర్వహిస్తామని ప్రజావాణిలో హెచ్చరించడం జరిగింది. గత వారం రోజుల నుండి నీటి సమస్య ఉన్నప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు గానీ నాయకులు గానీ పట్టించుకోవడం లేదని, బస్తి ప్రజలు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ  బిజెపి పట్టణ అధ్యక్షుడు కోణాల రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ పట్టణ కార్యదర్శి చిరంజీవి కౌన్సిలర్ మహేష్ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గోస్కి పురుషోత్త  తృప్తి శివప్రసాద్ ఫణిందర్ సాయి రెడ్డి మహేందర్ తో పాటు బస్తి మహిళలు  ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు