కల్లు దుకాణం తొలగించాలని వినతి
28-09-2026 | 08:19pm
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కాలనీలో రహదారి ఆనుకొని ఏర్పాటు చేసిన తెల్లకల్లు దుకాణం తొలగించాలని కాలనీవాసులు ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. రహదారి పక్కనే కల్లు దుకాణం(toddy shop) ఉండటంతో మహిళలు, ఇతర కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దుకాణానికి వచ్చే కొందరు రహదారి పక్కనే మూత్ర విసర్జన చేయడంతో దుర్వాసనతో పాటు అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని వాపోయారు. అదేవిధంగా కల్లు తాగిన అనంతరం ఖాళీ సీసాలను రోడ్లపై పడేయడంతో అవి పగిలి గాజు పెంకులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉంటున్నాయని తెలిపారు. మహిళలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉన్నారు