యాదగిరిగుట్ట వర్తక సంక్షేమ సంఘం అధ్యక్షుడి రాజీనామా
సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దుకాణాల ఓనర్లు ఏర్పాటు చేసుకున్న వర్తక వెల్ఫేర్ సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి గడ్డమీది మాధవులు రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం ఆయన తన రాజీనామా లేఖను సంఘ కార్యవర్గానికి సమర్పించారు. గత రెండేళ్లకు పైగా సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ప్రస్తుత వ్యక్తిగత కారణాల వల్ల సంఘ కార్యకలాపాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
సమయం ఇవ్వలేకపోతే సంఘానికి అన్యాయం చేసినట్లవుతుందనే భావనతోనే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించి, బాధ్యతల నుంచి ఉపశమనం కల్పించాలని ఆయన కార్యవర్గాన్ని కోరారు. గత రెండు సంవత్సరాలుగా కొండపైన వర్తక సంఘానికి సేవలను అందించాలని కొన్ని కారణాల వల్ల పని ఒత్తిడి వల్ల సమయం కేటాయించలేకపోతున్నారని అన్నారు.