విద్యుత్ సమస్యలు పరిష్కరించండి
ప్రజావాణి, విద్యుత్ ఏడీఈల వినతిపత్రమిచ్చిన బీజేపీ బల్దియా అధ్యక్షుడు అనంత్ రెడ్డి
చేవెళ్ళ జులై 8 (విజయక్రాంతి): చేవెళ్ల పట్టణ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ చేవెళ్ల ఏడీఈ సాయినాథ్కు వినతి పత్రమిచ్చారు. విద్యుత్ అంతరాయం తక్కువ వోల్టేజ్ సమస్యలు వివరించారు.
అనంతరం చేవెళ్ల ఆర్డీవో కార్యా లయంలో ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణిలో విద్యుత్ సమస్యపై వినతిపత్రం అందజేశారు.అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు అనంతరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, బీజేవై ఎంస్టేట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, డా. వైభవ్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ దేవుని శర్వలింగం, పత్తి సత్యనారాయణ, పీసరి శ్రీకాంత్ రెడ్డి, అల్లాడ అభిషేకర్ రెడ్డి, తెలుగు శ్రీనివాస్, బాల్ రెడ్డి, మధుకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జయసింహ రెడ్డి, వెంకటేష్, శివ కుమార్, అడ్వకేట్ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి మహిపాల్ రెడ్డి శివకుమార్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రాజు, రమేష్, జై సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






