1 May, 2026 | 7:32 PM

Breaking News

సీఐటీయు ఆధ్వర్యంలో ఘనంగా మేడే   •   కార్మికుల శ్రమే సమాజ అభివృద్ధికి మూలస్థంభం   •   ఎమ్మెల్యే మార్నింగ్ వాక్.. గుడ్ మార్నింగ్ పేరుతో పల్లెలన్నింటిని చుట్టుముట్టి సమస్యలు పరిశీలించి   •   మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి   •   నియోజకవర్గం స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   కార్మికుల అభ్యున్నతికి సంక్షేమ పథకాల అమలు   •   శిశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు   •   మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేవరకు పోరాడుతాం.....   •   తిమ్మంపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్   •  

విజయవాడ – హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీసులు పునః ప్రారంభం

04-09-2024 08:41 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వేట్రాక్ భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వేట్రాక్  పునరుద్ధరణ పనులను పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు.  అప్ లైన్ మార్గంలో రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా... డౌన్ లైన్ లో అర్థరాత్రి కల్లా పనులు పూర్తి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వరదల వల్ల మహబూబాబాద్ జిల్లా ధ్వంసమైన రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులను దాదాపు 52 గంటల్లో పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన రైలు సర్వీసులు మళ్లీ  ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.