calender_icon.png 25 December, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజకులకు అండగా రేవంత్ సర్కార్

16-03-2025 12:37:45 AM

మెట్టు సాయికుమార్

ముషీరాబాద్, మార్చి 15: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రజకులకు అండగా ఉంటుందని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. సీఎం బీసీల పక్షపాతి అని, ట్యాంక్‌బండ్‌పై వీరనారి ఐల మ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమె పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు.

శనివా రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో రజక, ఫిషర్‌మెన్ సొసైటీల క మిటీ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ కుమార్ రజక అధ్యక్షతన రజకుల జన శంఖారావం రజకుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభలో రజక ఫెడరేషన్ రాష్ట్ర సొసైటీల కమిటీ వ్యవస్థాపక చైర్మన్ అమనగంటి సైదులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రజక, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కోశాధికారి నేరెల కుమార్ పాల్గొన్నారు.