3 April, 2026 | 3:34 PM

Breaking News

సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి.. జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •  

గిరిజన సంక్షేమంపై జాతీయ కమిషన్ సమీక్ష

30-06-2024 12:38 AM

హైదరాబాదు, జూన్ 29 (విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శనివారం జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ సమీక్షించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ సమీక్ష జరిగింది. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ ఆధ్వర్యంలో అధికారులు తమ విభాగాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, వాటి పురోగతిపై కమిషన్‌కు వివరించారు. గిరిజన సంక్షేమ శాఖలోని విద్య, మౌలిక వసతుల కల్పన, ట్రైకార్, జీసీసీ విభాగాల పనితీరుపై ఆరా తీశారు. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాల నిధులతో అమలుచేస్తున్న ఆయా పథకాల పురోగతిని గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులను జాటోతు హుస్సేన్ అభినందించారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు.