4 May, 2026 | 9:01 PM

జిల్లా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం: డిఎంహెచ్వో

04-05-2026 07:36 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి జిల్లా కార్యాలయం నందు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. వేసవికాలం దృష్ట్యా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రతి ఆరోగ్య కేంద్రాలలో, ఆరోగ్య కార్యకర్త, ఆశల వద్ద గ్రామపంచాయతీలలో అంగన్వాడి కేంద్రాలలో, చలివేంద్రాలలో, జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలలో కచ్చితంగా, ఏర్పాటు చేయవలెనని వడదెబ్బకు సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు, నివేదికను జిల్లాకు సమర్పించవలసినదిగా సూచించడం జరిగింది.

గర్భిణీ స్త్రీల నమోదు జిల్లాలో 100% చేయాలని, వ్యాధి నిరోధక టీకాలను కూడా 100% లక్ష్యాన్ని సాధించాలని  అదేవిధంగా అసంక్రమిత వ్యాధులు అయిన బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ గుర్తింపు కొరకు గ్రామాలలో  స్క్రీనింగ్ కచ్చితంగా 100% పూర్తి చేయాలని వాటి నివేదికను ఎప్పటికప్పుడు జిల్లాకు సమర్పించవలనని, మలేరియా కేసులు పెరగకుండా ఇప్పటినుంచి జాగ్రత్తలు తీసుకోవాలని, ఫ్రైడే ఫ్రైడే పాటించాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించడం జరిగినది.

టీబీకేసు లను గ్రామాలలో గుర్తించి వారికి తెమడ పరీక్షలు చేయించి, వారికి చికిత్సను, అందజేయాలని సూచించడం జరిగినది. ఇప్పటివరకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో 98% లక్ష్యాన్ని సాధించినట్లు తెలియజేయగా, మిగిలిన 2% లక్ష్యాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి 100% సాధించవలసిందిగా వైద్యాధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.