4 May, 2026 | 8:40 PM

నాలుగు దశాబ్దాల కుటుంబం గెట్ టు గెదర్.. 139 మంది పుట్టిన రోజు ఒకే వేదికపై

04-05-2026 07:39 PM

బోత్,(విజయ క్రాంతి): మండలంలోని కౌటా(భి )గ్రామంలో. నాలుగు దశాబ్దాల కుటుంబం ఒకే వేదికపై కలవడం జరిగింది . నాలుగు దశాబ్దాల క్రితం కౌటా(భి )గ్రామంలో . జీవించిన సింగారపు లక్ష్మన్న వీటి ధర్మాబాయి నీ వివాహం ఆడాడు. అయితే వారికి ఆరుగురు ఆడబిడ్డలు ఆ ఆడబిడ్డల సంతానని మనుమలు మనవరాలు కొడుకులు అల్లుళ్ళు బిడ్డలు అంతా కలిసి ఒక వంద 39 మంది ఉన్నారు. వీరంతా కౌటా( బి) గ్రామంలో. ఒకే వేదిక పైకి వచ్చి కలవడంతో వారి కలయిక అపూర్వకంగా మారింది.

లక్ష్మన్న ధర్మా బాయ్ లకు పుట్టిన సంతానం లో మొదటి కూతురు అయిన లక్ష్మిని సోనాల మండల కేంద్రంలోని లక్ష్మన్నకు ఇచ్చి పెళ్లి చేశారు. రెండవ కూతురు భూదేవిని చించోలి గ్రామంలోని రాజన్నకు ఇచ్చారు మూడవ కూతురు ప్రేమలను కౌట (భి) గ్రామంలో నారాయణకు ఇవ్వడం జరిగింది. నాలుగవ కూతురి ని నర్మద ను రాజలింగం పోచ్చర కు ఐదవ కూతురు కలమ్మను కనుగుట్ట గ్రామంలోని లక్ష్మన్నకు ఇచ్చారు

ఆరవ కూతురు చిన్నబాయని దన్నూర్ గ్రామంలోని మైలారపు ధర్మాన్నకు ఇవ్వడం జరిగింది అయితే వీరందరికీ పుట్టిన బిడ్డలు బిడ్డల బిడ్డలు అంతా కలిపి ఒక వంద 39 మంది ఉన్నారు. వీరి కలయిక  సందర్భంగా తల్లులకు పాద పూజ చేశారు. దీంతో వీరి కలయిక నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. కోలాహలంగా కొనసాగిన వీరి కలయికను పలువురు అభినందించారు. ఉరుకులు పరుగుల జీవితంలో తోబుట్టువులను పట్టించుకోని నేటి సమాజంలో ఆరుగురు తల్లులు వారి వారి సంతానాన్ని ఒకే వేదికపైకి తీసుకు రావడం గొప్ప విషయమని పలువురు పేర్కొంటున్నారు