నేటి నుండి నిరవధిక సమ్మెలో రైస్ మిల్లులు
16-09-2026 | 03:15pm
ములుగు,(విజయ క్రాంతి): రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్(Telangana Rice Millers Association) పిలుపు మేరకు బుధవారం నుండి జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ మేరకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో పలువురు రైస్ మిల్ యజమానులు, యూనియన్ సభ్యులు ములుగు ఆర్డీవో కార్యాలయంలో ఏవో కు వినతి పత్రం అందజేశారు. బుధవారం నుండి జిల్లా వ్యాప్తంగా తామంతా నిరవధిక సమ్మె(indefinite strike)లో పాల్గొంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా రైస్ మిల్లర్ల(Rice millers) ఆందోళనలతో ప్రభుత్వం వారికి అనుకూలంగా ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.