యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది దుర్మరణం
18-08-2024 01:57 PM
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సేలంపూర్ ప్రాంతంలో ఆదివారం పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో పది మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. బుదౌన్-మీరట్ రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.






