బీజేపీలోకి ఝార్ఖండ్ మాజీ సీఎం..?
18-08-2024 01:24 PM
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో రాజకీయ పరిణామాలు సంక్షోభం దిశగా చేరుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. చంపై సోరెన్‌తో పాటు కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చంపై సోరెన్ బృందం ఢిల్లీ బయల్దేరింది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది. హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. హేమంత్ సోరేన్ జైల్లో ఉన్నపుడు సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.






