కొనుగోలు చేసిన మక్కలను గోదాంలకు తరలించాలని రాస్తారోకో
గుండాల, మే 19 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాంలకు తరలించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో పీఏసీఎస్ వద్ద ఇల్లందు - గుండాల ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఆ పార్టీ నాయకులు ఆందోళన విరమించేది లేదని ప్రధాన రహదారిపై కూర్చున్నారు. అక్కడికి చేరుకున్న స్థానిక అధికారులు తహసీల్దార్ కాశీం, ఎస్త్స్ర సైదా రావుఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడి రేపటి నుండి మొక్కజొన్న ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.
అనంతరం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా నాయకులు, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, బచ్చల సారయ్య లు మాట్లాడుతూ.. గత నెలరోజుల నుండి మొక్కజొన్నల కొనుగోలు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి గోదాములకు తరలించలేరని, సొసైటీ ప్రాంగణంలో ఉన్న మొక్కజొన్నలు వర్షంకు తడిసి మొలకలు ఎత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం మొక్కజొన్న ధాన్యాని గోదాములకు తరలించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు గడ్డం లాలయ్య, పర్శక రవి, యాసారపు వెంకన్న, అరెం నరష్, ఈసం కృష్ణ, మానాల ఉపేందర్, పెండకట్ల పెంటన్న, భూక్యా వెంకన్న, పూనెం నరసన్న, పాయం ఎల్లన్న, గొగ్గెల శ్రీను, కల్తి నరసింహారావు, తాటి రమేష్, అరెం రామారావు తదితరులు పాల్గొన్నారు.






