ఈ పువ్వులు వాడిపోవు..!
ప్రస్తుతం పెళ్లి, బర్త్ డే పార్టీలు, ప్రీ వెడ్డింగ్ షూట్లలో రోజ్ పెటల్ డెకరేషన్ ట్రెండ్‌గా మారిపోయింది. కానీ నిజమైన గులాజీలు కొనాలంటే ఖర్చు ఎక్కువే ఉంటుంది. పైగా త్వరగా వాడిపోతాయి. అందుకే అచ్చుగుద్దినట్టు నిజమైన గులాబీ రెక్కలను పోలిన రియలిస్టిక్ రోజ్ పెటల్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి వాడిపోవు, నలిగిపోవు, వీటికి మరో ప్రత్యేకత ఏంటీ అంటే నిజమైన గులాబీలకు ఉండే వాసన కూడా వీటికి ఉండేలా తయారు చేస్తున్నారు. దీంతో షూట్‌లకు వీటినే వాడుతున్నారు. వాడిపోతాయి, మచ్చలు పడతాయనే భయాందోళన లేకుండా ప్రశాంతంగా ఆర్టిఫిషియల్ గులాబీ రేకుల్ని చక్కగా వాడుకోవచ్చు. ఎరుపు, తెలుపు, పసపు, నీలం.. ఇలా ఎన్నో రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. వీటిని వస్త్రంతో చేస్తారు. ఆకృతే కాదు, అందులోని గీతలూ నిజమైన గులాబీ రేకులను మరిపిస్తాయి. గులాబీల సువాసనను కూడా వెదజల్లేలా ప్రత్యేక సాంకేతికత ఉపయోగించి వీటిని తయారు చేస్తాయి.






