17 July, 2026 | 7:32 PM

రోస్టర్ విధానం ఎత్తివేయాలి

17-07-2026 07:32 PM

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం 

 జాతీయ మాల మహానాడు డిమాండ్

పాల్వంచ,(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, మాలలకు అన్యాయం చేస్తున్న రోస్టర్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు తోటమల్ల రమణమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం పాల్వంచలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు ఆగస్టు 1న జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జిల్లాలో మాలల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను చేపడతామని తెలిపారు.