17 July, 2026 | 6:27 PM

ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన గొట్టిముక్కుల సురేష్ రెడ్డి

17-07-2026 06:27 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు బూత్‌ల లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను శుక్రవారం  బీజేపీ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి సందర్శించి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  ప్రక్రియ అమలును పరిశీలించారు. బూత్‌ల వద్దకొనసాగుతున్న  ఓటరు నమోదు, సవరణలు, తొలగింపులు తదితర అంశాలపై బూత్ స్థాయి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవసరమైన సూచనలు చేస్తూ, ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని,  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.