యాదగిరిగుట్టలో 5కే రన్
10-03-2026 12:10 AM
వ్యర్థ పదార్థాల సేకరణ కోసం వాహనం ఏర్పాటు
యాదగిరిగుట్ట, మార్చి 9: యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5కే రన్లో ఉదయం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు యువతతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరింత చేరువవుతున్నాయని తెలిపారు. ఆరోగ్యం, ఐక్యత మరియు సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముకర్ల మల్లేష్ యాదవ్, గుండ్లపల్లి భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




