10 March, 2026 | 3:12 AM

కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో బహుమతులు సాధించిన కిట్స్ విద్యార్థినులు

10-03-2026 12:11 AM

కోదాడ, మార్చి 9: కరాటే ఛాంపియన్షిప్ పోటీలో కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు బహుమతులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ సోమవారం తెలిపారు.

కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిలకలూరిపేటలో ఆదివారం నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో కరాటేలోని కట విభాగంలో  కిట్స్ కళాశాల బీటెక్ మొదటి సంవత్సరం ఎలక్ట్రికల్  ఇంజనీరింగ్ చదువుతున్న మల్లూరి అంజలి  మొదటి బహుమతిగా కరాటే ట్రోపీ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఇదే కరాటే లోని కట విభాగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న జోగి రవళి ద్వితీయ బహుమతి కరాటే లోని కుమితే తృతీయ బహుమతి గా కరాటే ట్రోపీ ప్రశంసా పత్రం అందుకున్నారు.

కరాటేలో విజేతలుగా బహుమతులు అందుకున్న విద్యార్థినులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, వివిధ విభాగాదీపతులు, కరాటే మాస్టర్  మాధవి లత అభినందించారు.