తెలంగాణ సచివాలయంలో రైతు నేస్తం కార్యక్రమం
19-11-2024 12:40 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన రైతునేస్తం డిజిటల్ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతులతో ముచ్చటించిన మంత్రి తుమ్మల పంట వ్యర్ధాల దహనం చేయడం వల్ల వచ్చే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగొళ్లపై రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, అనంతరం సీసీఐ, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుమ్మల నాగేశ్వరరావు మాట్లడారు.






