10 March, 2026 | 5:58 AM

పెద్దపల్లి జిల్లాలో సంచలనం

09-03-2026 01:52 PM

రూ 19,89 కోట్ల సీఎంఆర్ బియ్యం ఎగవేత

రైస్ మిల్లు యజమానుల అరెస్ట్...

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో(Peddapalli district) కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) ఎగవేతదారులుగా ఉన్న రైస్ మిల్లు యజమానులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్లాది రూపాయల విలువైన బియ్యాన్ని ఇవ్వకుండా ఏళ్లుగా తప్పుదోవ పట్టిస్తున్న సాయి మహాలక్ష్మి రైస్ మిల్లు యజమానులను అరెస్ట్ చేయడం జరిగిందని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్  తెలిపారు, సోమవారం సిఐ, ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి లో గల సాయి మహాలక్ష్మి రైస్ మిల్లు యాజమాన్యం తీరుపై సివిల్ సప్లై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి తిరిగి అప్పగించాల్సిన సుమారు 19.89 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించకుండా ఏళ్లుగా ఈ మిల్లు నిర్వాహకులు కాలయాపన చేస్తున్నారు అని,​కనీసం బియ్యం ఇవ్వకపోయినా, దానికి సమానమైన బ్యాంక్ గ్యారెంటీని కూడా సమర్పించకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ మొండికేస్తున్నారు. దీంతో సివిల్ సప్లై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సుల్తానాబాద్ పోలీసులు.. మిల్లు భాగస్వాములైన బండారి మారుతి, మరియు శారదల పై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.