సీసీ రోడ్డు పనులు ప్రారంభం
09-03-2026 01:55 PM
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ఆదేశానుసారం ఎనర్జియస్ పథకం కింద రూ. 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు సర్పంచ్ స్వాతి బాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజక వర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ చొరవతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బస్సీ దశరథ్, లభాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్, ఉప సర్పంచ్ ఉదల్ సింగ్, మాజీ సర్పంచ్ సాయిమల్, వార్డు సభ్యులు సుందల్ సింగ్ , దౌలత్ రామ్, రంజిత్, కారొభార్ జగదీష్ , తండా ప్రజలు పాల్గొన్నారు..




