03-02-2026 01:58:46 PM
హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad Police Commissioner VC Sajjanar) మంగళవారం నాడు ప్రజలకు, ముఖ్యంగా యువతకు, ప్రమాదకరమైన రీల్స్ చేయవద్దని హెచ్చరించారు. రైల్వే ట్రాక్‌లపై పడుకుని ప్రాణాలను పణంగా పెట్టి ఒక వ్యక్తి చేసిన రీల్‌పై స్పందిస్తూ, ఆయన ‘ఎక్స్’లో ఇలా అన్నారు. “వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఒక్క సెకను తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాధ్యతగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండకండి” అని సజ్జనార్(Sajjanar) సూచించారు. ఫేమస్ అయిపోవాలని రీల్స్ పిచ్చిలో యువత వింత వింత ప్రయత్నాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే.