9 May, 2026 | 9:49 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ప్రకృతి వనంలో సకలేష్‌పూర్

27-01-2025 12:00 AM

దట్టమైన అడవులు.. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అనిపించే ఎత్తున వృక్ష సంపద.. జలపాతాల హోరు.. కొండల్ని చీల్చుకుంటూ రైలు మార్గం.. హోరెత్తుతూ నీటి ప్రవాహాలు.. ఇవన్నీ సొంతం చేసుకున్నది సకలేష్‌పూర్. ఇది బెంగళూరు నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రకృతి సౌందర్యంలో మరో అద్భుతమైన కట్టడం కనువిందు చేస్తుంది. అదే మంజరాబాద్ కోట.

ఈ అందమైన పర్యాటక ప్రాంతంలో మంజరాబాద్ ఫోర్ట్, సకలేష్‌పూర్ మరో ప్రధాన ఆకర్షణ. ఈ కోటను మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ నిర్మించాడు. ఈ కోట నిర్మాణం ఇస్లామిక్ వాస్తు శైలిని పోలి ఉంటుంది. దేశంలో ఎక్కడా లేనట్లు మంజరాబాద్ కోట నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ కోటను సముద్ర మట్టానికి 3,240 అడుగుల ఎత్తులో నిర్మించారు. మంజరాబాద్ కోట మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.

ఈ కోట గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ కోటలో అనేక గదులు, బావులు ఉన్నాయి. మంజరాబాద్ కోట ఒక స్టార్ షేప్‌ను కలిగి ఉండటం వల్ల ఈ కోటను ‘స్టార్ ఫోర్ట్ ఆఫ్ ఇండియా’ గా పిలుస్తారు. ఈ కోట సమీపంలో ఒక పవిత్రమైన దేవాలయం ఉంది. ఆ ఆలయమే సకలేశ్వర దేవాలయం. ఇది ఒక పురాతనమైన శివాలయం.

ఎలా వెళ్లాలి

హైదరాబాద్ నుంచి 600 కిలో మీటర్ల దూరంలో సకలేష్‌పూర్ ఉంటుం ది. రైలు, బస్సు, విమాన సౌకర్యం కలదు. అక్కడికి చేరుకోవడానికి దాదాపు 17 గంటల సమయం పడుతుంది.