14 August, 2026 | 6:51 PM

ప్రియ మిల్క్ కంపెనీ పార్లర్ ప్రారంభం

14-08-2026 05:49 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని కోతి రాంపూర్ ప్రాంతంలోని పోచమ్మ వాడలో గుడికి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ప్రియ మిల్క్ కంపెనీ పార్లర్ ను శుక్రవారం  ఘనంగా ప్రారంభించారు. ప్రియ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ పార్లర్‌ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రియ మిల్క్ సంస్థ విశ్వసనీయతతో కూడిన సేవలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో కార్పొరేటర్ మాసం గణేష్,  కార్పొరేటర్ కె. ఏపీపీ చంద్ర , ప్రియ మిల్క్ సంస్థ ప్రతినిధులు, నిర్వాహకులు శ్రీనివాస్, స్థానిక ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.