14 August, 2026 | 5:11 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

14-08-2026 04:38 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు.నాగిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ మన్నే వెంకటి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని హనుమాన్లు ఆధ్వర్యంలో లబ్ధిదారులు మన్నె సుజాతకు సీఎంఆర్ 18500 చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తన చెక్కు మంజూరుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,గ్రామ సర్పంచి మన్నె వెంకటి, గ్రామ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నే వెంకటి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని హనుమాన్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ ఠాగూర్,సాయా  గౌడ్,శ్రీనివాస్ గౌడ్,షకీల్, మల్లేశం తదితరులు ఉన్నారు.