విద్యాలయమే దేవాలయం ... గ్రామ దేవాలయం

01-10-2026 | 07:00pm

చిన్నారులకు సురక్షిత మంచినీరు

ఉట్నూర్,(విజయక్రాంతి): విద్యాలయమే దేవాలయం.. విద్యే నిజమైన వెలుగు... అనే భావనతో...గ్రామంలోని విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రామ కమిటీ మరియు గ్రామ ప్రజలు కలిసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉట్నూర్ మండలంలోని సాలెవాడ గ్రామం(Salewada Village)లో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు విద్యాబోధనలో కొంత ఇబ్బంది ఏర్పడుతున్న  ఇబ్బందిని  గ్రామస్తులు గుర్తించారు. ఈ నేపథ్యంలో   విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అదనపు ట్యూషన్(Extra Tuitions) తరగతులను నిర్వహించాలని  గురువారం గ్రామ కమిటీ నిర్ణయించింది.

 గ్రామ సర్పంచ్ మెస్రం రాధాబాయి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో D.Ed., TET అర్హత కలిగిన ఒక అభ్యర్థిని  ఉపాధ్యాయుడుగా ఎంపిక చేసి  విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించే బాధ్యతను అప్పగించాలని  నిర్ణయించారు.  గ్రామ కమిటీ తరఫున ప్రతి నెల ₹5,000/- గౌరవ వేతనం  అందజేయాలని నిర్ణయించారు. అదేవిధంగా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులకు శుద్ధి చేసిన (Purified) తాగునీటిని గ్రామం తరఫున అందించడం జరుగుతుంది.

మన పిల్లల చదువు మన బాధ్యత – వారి భవిష్యత్తు మన గ్రామ భవిష్యత్తు. అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలని నిర్ణయించారు. “ఒక్క విద్యార్థి జీవితంలో వెలుగు నింపితే… ఒక కుటుంబ భవిష్యత్తు మారుతుంది. ఒక గ్రామం విద్యావంతమైతే… ఆ గ్రామ భవిష్యత్తే మారుతుంది సమావేశంలో నిర్ణయించారు. సమావేశ అనంతరం  విద్యార్థులకు స్వచ్ఛమైన సురక్షిత నీటి పథకాన్ని  సర్పంచ్ ప్రారంభించారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు