కామారెడ్డిలో శానిటేషన్ కార్మికుల ధర్నా

06-10-2026 | 11:32am

పని భారం పెంచి వేధింపులకు గురి చేస్తున్నారని కార్మికుల ఆందోళన 

వేతనాలు ఇవ్వాలని డిమాండ్ 

పనులు బందు చేసి నిరసన

కామారెడ్డి,(విజయక్రాంతి): మున్సిపల్ సానిటేషన్ కార్మికుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కామారెడ్డి మున్సిపల్ శానిటేషన్ కార్మికులు పని బందు చేసి కార్యాలయం ఎదుట  ఆందోళన చేపట్టారు. ఉదయం నాలుగు గంటల నుంచి నిరసన చేపట్టారు. చెత్త బండ్లు కొత్తవి ఏర్పాటు చేయాలని పాతబండ్లతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు శాంటిసన్ జవాన్లు తమ ఇష్టానుసారంగా కార్మికుల పట్ల దుర్సుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

పనిచేసిన వారిపై మరింత పని భారం వేస్తున్నారని, వారికి అనుకూలంగా ఉన్న కార్మికులకు పని చేయకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. నిజాయితీగా పని చేసే కార్మికుల పైనే అని భారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ కు, మున్సిపల్ చైర్ పర్సన్ కు తమ సమస్యలను వివరించిన పట్టించుకోవడంలేదని కార్మి కులు తెలి పారు. వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికుల ఆరోపించారు. పని భారం పెంచడం తగ్గించాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

సిపిఎం నాయకులు చంద్రశేఖర్ కార్మికులకు మద్దతుగా నిలిచి ఆందోళన చేపట్టారు. కార్మికులపై వేధింపులను మానుకోవాలని డిమాండ్ చేశారు. వేతనాలు స కాలంలో ఇవ్వాలని కోరారు. అసలే పండుగలు వస్తున్నందున కార్మికులు పస్తులు ఉండాల్సి వస్తుందని, పండుగ సామాగ్రి తెచ్చుకునేందుకు అప్పులు చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది, అడ్వాన్స్గా సాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కమిషనర్ పర్వతాలు , మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమా రాణి శ్రీనివాస్ లు జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని  కోరారు. మరింత మంది కార్మికులను పెంచాలని ప్రస్తుతం ఉన్న కార్మికులు సరిపోవడం లేదని అన్నారు. కార్మికుల పైన పని భారం పెరుగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు