జీళ్ళచెరువులో వినాయక విగ్రహం వద్ద ఆకట్టుకున్న సంకీర్తన
19-09-2026 | 11:13am
కూసుమంచి, విజయక్రాంతి: మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో బొడ్రాయి బజార్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం రాత్రి ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భక్త భజన మండలి సభ్యులతో సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, భక్తులను ఆకట్టుకుంటుంది. హనుమాన్ చాలీసా, సంకీర్తన పారాయణంతో భజన బృందం సభ్యులు పాటలను ఆలపించారు. అనంతరం వినాయకుడికి పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు అంబాల వెంకటేశ్వర్లు-సత్యావతి, వినోద్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య, సభ్యులు ముద్రబోయిన వెంకటనారాయణ, వీరబాబు, సైదులు, మీరా, బెజవాడ శ్రీకాంత్, కొండా నగేష్, యాదగిరి పాల్గొనగా, భజన బృందం సభ్యులు చెన్నా వెంకన్న, చెన్నా విజయ్, అంబాల సైదులు, గోగుల అంజయ్య, చెన్నా వీరభద్రం, చారి, భాస్కరచారి తదితరులు పాల్గొని పాటలు పాడారు