సూరయ్యపల్లిలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు
మంథని మార్చి 22 (విజయక్రాంతి) మంథని మండలంలోని సూర్యయ్యపల్లి గ్రామంలో రైతువేదిక నుండి తేనుగగూడెం వరకు గ్రామపంచాయతీ కార్యాలయం నుండి పోచమ్మ దేవాలయం వరకు రూ. 15 లక్షల రూపాయలతో ఈజీఎస్ ఫండ్ కింద భూమి పూజ చేశారు. అనంతరం సర్పంచ్ ఆర్ల నాగరాజుతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్,
జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ అరెల్లి కిరణ్ లు మాట్లాడుతూసూరాయపల్లె గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు కు గ్రామ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు సంబంధించి ఇంకొక రెండు రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయని వాటిని పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, మరి కొద్ది రోజులలో ఆ రోడ్డును పూర్తిస్థాయిలో సాంక్షన్ చేపించి నిర్మించడం జరుగుతుందని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరెల్లి సుచిత-వరుణ్, వార్డు సభ్యులు భీముని చిన్న స్వామి, సుంకరి శ్రావణ్, ఆర్ల క్రాంతి, ఆకుల సందీప్, రేపాక దుర్గమ్మ, శ్రీనివాస్, జెంజర్ల అమరేందర్, రావుల బానమ్మ, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు జంజర్ల మల్లేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంజర్ల రాజు, కోరబోయిన కిట్టు, జంజర్ల పెద్దగట్టయ్య, కొండ్ర రాజయ్య, తాటి సమ్మయ్య, చింత నిప్పుల రవి, రేపాక శంకర్, రేపాక మల్లయ్య, తాటికట్టి రమ్మక్క, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల సురేష్, రావుల నాగేష్, ప్రతినిధులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




