10 June, 2026 | 3:01 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

నర్మెట తరలివెళ్లిన నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు

23-03-2026 12:33 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 22 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలం నుండి ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు సిద్దిపేట జిల్లాలోని నార్మెట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ కర్మగారానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న సందర్భంగా పార్టీ కార్యక్రమానికి మండలానికి చెందిన ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రత్యేక బస్సుల్లో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

ఆయిల్ ఫామ్ కర్మాగారం కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు, రైతు భరోసా నిధుల విడుదల ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభం రైతులకు అంకితం దేశ వ్యవసాయ చరిత్రను తిరగరాస్తున్న తెలంగాణ రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 70 లక్షల మంది అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుపడం జరిగిందని మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

అలాగే రైతు రాజుల బతకాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో మూడు విడుదల్లో తొమ్మిది వేల కోట్లు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్లు తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్లు లక్ష్మణ్ ఠాగూర్, పసులది కిష్టయ్య, జిల్లా నాయకులు ఇమామ్, మండల నాయకులు క్రిస్టఫర్, సంతోష్ కుమార్, నారాయణ, మన్నే లచ్చయ్య, నాయికోటి మల్లేశం, మోహన్, బలరాం రెడ్డి,బాలయ్య,ధర్మవీర్ తదితరులు వెళ్లారు.