ముగిసిన ఎస్సీ కార్పొరేషన్ ఇంటర్వ్యూ
బెజ్జూర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ 2025 -26 ఆర్థిక సంవత్సరానికి ఎలక్ట్రిక్ ఆటోస్, ఎలక్ట్రిక్ స్కూటర్స్, పాడి గేదెలకు సోలార్ పంపుసెట్ల కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం కోరుతూ (38) దరఖాస్తులు చేసుకున్నారు. హాజరైన వారు (37) హాజరైన వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి నట్లు తెలిపారు.
ఇందులో గతంలో కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందని వారికి సివిల్ రిపోర్టు ఉన్నవారికి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారికి మండల కమిటీ ఎంపిక అయిన తర్వాత, మంజూరు కొరకు ఈడిఎస్‌సి కార్పొరేషన్ సమర్పించబడునని ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సత్య కిరణ్, పశువైద్యాధికారి లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ప్రతినిధి,ప్రశాంత్,ఐకెపి సి సి రంగయ్య, జూనియర్ అసిస్టెంట్ మూసా సోహెల్ పాల్గొన్నారు.






