పలు కాలనీల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల పరిశీలన
30-04-2026 02:44 AM
నిర్మల్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పట్టణంలోని పలు కాలనీలలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఇంద్రనగర్ (వార్డ్ నెం.9)లోని జౌళి నాల పూర్తిగా చెత్త చెదారంతో నిండి ఇండ్లలోకి మురుగు నీరు రావడంతో వార్డ్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ దృష్టికి తీసుకురావడంతో బుధ వారం జౌళి నాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వెంట మున్సిపల్ కమీషనర్ జగదీశ్వర్ గౌడ్, డిఈ హరిభువన్ కౌన్సిలర్లు శ్రీకాంత్ యాదవ్, ఎస్‌పీ రాజు, లక్కాకుల హరీష్ తదితరులు ఉన్నారు.






