22 April, 2026 | 2:05 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

భయపెడుతున్న రోడ్డు ప్రమాదాలు

19-10-2024 12:00 AM

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భయంగొలిపే స్థాయిలో పెరిగిపోతోంది. ఏ వార్తాపత్రికను తిరగేసినా భయంకరమైన రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాతకు గురైన అభాగ్యుల ఫోటోలు ప్రతిరోజూ దర్శనమిస్తాయి. వాహనాల సంఖ్య విపరీతం గా పెరిగిపోయింది. 

రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారుకావడం, ట్రాఫిక్ నిబంధనలను కనీసంగా కూడా పాటించకపోవడం, మితిమీరిన వేగం, కాలం చెల్లిన వాహనాలు, పరిమితికి మించిన లోడ్‌తో పరుగులు తీసే లారీలు, ట్యాంకర్లు రోడ్డు ప్రమాదాలకు నేపథ్యంగా నిలుస్తున్నాయన్నది వాస్తవం. దీనికి తోడు ఇటీవల కాలంలో ’సెల్ రైడింగ్’ విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జనంతో కిక్కిరిసిన నగర రోడ్లు, వాహనాలు బారులు తీరిన హైవేలలో అష్టకష్టాలు పడుతూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అన్నది సర్వసాధారణంగా మారింది. పోలీసులు దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠినంగా వ్యవహరించాలి.

ట్రాన్స్ పోర్టు అధికారులు కూడా వాహనాల విషయంలోనూ, లైసెన్సుల మంజూరులోనూ ముందు జాగ్రత్తలను పాటించాలి. ట్రాఫి క్, ఆర్టీఏ విభాగాల్లో సిబ్బంది కొరతలేకుండా చూస్తే రోడ్డు ప్రమాణా లను నివారించడం సులభమవుతుంది.

 సింగు లక్ష్మీనారాయణ,కరీంనగర్ జిల్లా