రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం
టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం బోడు గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కృషి విజ్ఞాన కేంద్రం డా. టి. భరత్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులు పంటలను పండించే క్రమంలో మొత్తాడుకు మించి ఎరువులను వాడకం చెయ్యడం వలన భూసారం తగ్గిపోవడం గమనించటం జరిగిందన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న వరి రకాలను మాత్రమే పండించాలని తెలిపారు. విస్తరణ శాస్త్రవేత్త డా. హేమ శరత్ చంద్ర మాట్లాడుతూ రైతులు కృషి విజ్ఞాన కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉద్యాన శాస్త్రవేత్త బి శివ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలు అవగాహన కార్యక్రమo గురించి వివరించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ చేయబోతున్నారని వివరించారు. రైతులు ఒకే రకమైన పంటలను పండిస్తున్నారని, అందువలన ఇది రైతులకు కూడా గిట్టుబాటు కావడం లేదని, పంట మార్పిడి పాటించడం ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందటంతో పాటు నేలతల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ముఖ్యంగా పందిరిలో కూరగాయల సాగు, ఆయిల్ పామ్ పంట, నీళ్ల సౌకర్యం లేని చోట కుంకుడు పంటను పండిస్తే కనుక తక్కువ పెట్టుబడితో అధిక నికరం ఆదాయం పొందవచ్చని అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ రైతులు అందరు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, రైతులు పాల్గొన్నారు.






