7 April, 2026 | 4:36 AM

సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్

29-10-2024 04:40 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి మంగళవారం అరెస్ట్ అయ్యారు. దీంతో ఆమెకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. పద్మజారెడ్డి సుభాష్‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేశారు. జ్యోతి అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్‌ను జ్యోతి పద్మజారెడ్డికి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల పద్మజారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్ అయి కటకటాల పాలైంది.