సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్(Ujjaini Mahankali Bonalu Jatara schedule) ఖరారైంది. ఆలయ చైర్మన్ ,అర్చకులు శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, సికింద్రాబాద్ – 2026 బోనాల జాతర కార్యక్రమాల షెడ్యూల్ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందించారు.
ఈ ఆషాఢ జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆలయ అర్చకులు మంత్రిని కోరారు. ఆషాఢ మాస బోనాలకు ప్రజాప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని త్వరలోనే ఆషాఢ మాస బోనాలకు సంబంధించి అధికారులతో దేవాదాయ శాఖ మంత్రితో కలిసి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు.
దేవస్థానం అందించిన వివరాల ప్రకారం
అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు)
19-07-2026 (ఆదివారం) సాయంత్రం 4.00 గంటలకు
ప్రధాన బోనాల ఉత్సవం
02-08-2026 (ఆదివారం)
ఉదయం 4.00 గంటలకు
రంగం కార్యక్రమం
03-08-2026 (సోమవారం)
ఉదయం 8.30 గంటలకు
అమ్మవారి గజవాహన ఊరేగింపు ఉదయం 10.30 గంటలకు.






