17 July, 2026 | 2:38 AM

అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల గుడుంబా పట్టివేత

17-07-2026 02:38 AM

భూపాలపల్లి, జూలై 16 (విజయక్రాంతి): జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా గురువారం ఉదయం భూపాలపల్లి సీసీఎస్ బృందం తనిఖీలు నిర్వహించి సుమారు 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాలతో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భాగంగా, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్వ్యాలీ స్కూల్ వెనుక ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా అక్రమంగా గుడుంబా తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో పెద్దకుంటపల్లి తండాకు చెందిన అజ్మీర రజిత , నంగావత్ పార్వతి 38 ఉన్నారు. వారి వద్ద నుంచి గుడుంబాను స్వాధీనం చేసుకుని, నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం భూపాలపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లాలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందనిఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.