సహకారానికి పాలకవర్గం కసరత్తు
- పాత వర్గానికి పాలకవర్గ పదవులు
- సీనియర్లకి అవకాశం
- కాంగ్రెస్లో పదవుల పందేరం
నిర్మల్ అక్టోబర్ 1 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు, ఎఫ్ ఎ సి ఎస్ పాలకవర్గ నామినేటెడ్ పదవుల(Nominated Posts)పై కాంగ్రెస్ పార్టీలో కసరత్తు ప్రారంభమైంది. నిర్మల్ జిల్లాలో మొత్తం 17 సహకార సంఘాలతో పాటు ఒక ఎఫ్ఎసిఎస్ సహకార సంఘం ఉండగా ప్రభుత్వం ఇటీవలే సహకార సంఘాలకు పాలకవర్గం గడువు పొడిగించింది. ఇప్పటివరకు సహకార సంఘాలకు సంఘంలో సభ్యత్వం ఉన్న రైతుల ఓట్లతో ఎన్నిక నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో నిర్మల్ ముధోల్ ఖానాపూర్ నియోజకవర్గాలు ఉండగా అధికార పార్టీకి చెందిన సీనియర్ నేతలకు సహకార సంఘంలో చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ల పదవులను నామినేటెడ్ పద్ధతిలో ప్రభుత్వం నియమించాలని నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత నామినేటెడ్ పదవులను భర్తీ చేసే విధంగా పార్టీ అధిష్టానం సిగ్నల్ ఇవ్వడంతో నిర్మల్ జిల్లాలోని సహకార సంఘాలతో పాటు ఎఫ్ఎసిస్ సహకార సంఘం పాలకవర్గ ఏర్పాటుకు ఆశావాదుల నుండి దరఖాస్తులు చేసుకోగా తుది ఎంపిక కసరత్తు ముమ్మరం చేశారు.
సీనియర్లకు ప్రాధాన్యత
నిర్మల్ జిల్లాలో మొత్తం 17 సహకార సంఘాలతో పాటు ఒక ఎఫ్ ఎస్ సి ఎస్ సహకార సంఘం పాలకవర్గం ప్రభుత్వం ఖరారు చేయను నేపథ్యంలో ఆయా మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి విధేయత ఉంటూ కష్ట కాలంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేట్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించినట్టు చెప్తున్నారు. 2023లో ఎన్నికల తర్వాత నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఖానాపూర్ లో ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యే ప్రాతినిథ్యం ఉండగా మిగతా రెండు నియోజకవర్గాల్లో బిజెపి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
దీనికి తోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాత కొత్త నేతల మధ్య పార్టీ పదవుల కోసం రెండు వర్గాల అనుచరులు తీవ్రస్థాయిలో తమ ప్రయత్నాలను సాగిస్తున్నారు. అయితే 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకి రావడంతో కష్ట కాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నాయకులకు మాత్రమే పిఎసిఎస్ ఎఫ్ఎసిఎస్ లో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో తాము కూడా కలిసి పనిచేస్తున్నామని తమ వర్గీలో కూడా పదవులు ఇవ్వాలని ఇటీవలే పార్టీలో చేరిన నేతలు అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పాత కొత్త నేతల కలయిక ను సమన్వయం చేసుకొని పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పదవిలో అవకాశం ఇవ్వాలని ఇందులో అవకాశం దక్కని వారికి మార్కెట్ కమిటీ దేవాదాయ కమిటీలో అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతుంది.
ఎంపికపై కసరత్తు
నిర్మల్ జిల్లాలో సహకార సంఘాలతో పాటు ఎఫ్ ఎ సి ఎస్ సహకార సంఘానికి పాలకవర్గాలను ఖరారు చేసేందుకు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. ముధోల్ నియోజకవర్గం ఆ పార్టీ ఇంచార్జ్ నారాయణరావు పటేల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నేతలు తమ వర్గీయులకు పదవులు ఇచ్చుకునేలా తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. నిర్మల్ నియోగ్రాంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ హరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి ముఖ్య నేతలు ఉండడంతో ఈ ముగ్గురి వర్గీల నుండి పేర్లను పరిశీలిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో గత పది సంవత్సరాలనుంచి నుంచి కష్టపడ్డ పార్టీ నేతలకి పదవులు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కసరత్తును శ్రీ హరి రావు వర్గం చెందిన ముఖ్య నేతలు వడపోత చేసి పార్టీ అధిష్టానానికి పంపడం జరిగిందని కొన్ని పాలకవర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇక ఖానాపూర్ లో ప్రాథమిక వహిస్తున్న ఎమ్మెల్యే వే డుమ బుజ్జి పటేల్ సూచించిన వ్యక్తులకి పదవులు వచ్చే అవకాశం ఉంది.
ఖానాపూర్ లో సత్తనపల్లి ఖానాపూర్ దస్తురాబాద్, కడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇక నిర్మల్ లో మంజులాపూర్ కౌట్ల బన్సపల్లి ఆలూరు లక్ష్మణ్ చందా మామడ, ముఠాపూర్ నిర్మల్ ఎఫ్ ఎస్ సి ఎస్ లు ఉన్నాయి. ఇక ముదోలు కుంటాల లోకేశ్వరం కుబీర్ అంగిర్గా బెదిరిల్లి బైంసా పిఎసిస్లు ఉన్నట్టు చెప్తున్నారు. ఒక్కొక్క సహకార సంఘంలో చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు పదిమంది డైరెక్టర్లు పదవులు పొందే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆశావాదులు నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు